Monday, May 21, 2007

పావ్ బజ్జి

కావలసినవి :

పావ్ లు - 8

బట్టర్ - పావ్ లు వేయించడానికి

బజ్జి తయారికి :

బంగాలదుంపలు - 3(వుడకబెట్టి మెత్తగ చెయ్యాలి)

ఉల్లిపాయలు - 2

టొమటొలు - 2

బీన్స్ - 1/4 cup

క్యారెట్ - 1/4 cup

పచ్చి బఠానిలు - 1/4 cup

క్యాప్సికం - 1

అల్లం వెల్లుల్లి పేస్టు - 1 to 2 tbl spoons

బట్టర్ - 2

పావ్ బజ్జి మసాల - 2 to 3 tbl spoons

కారం - 1 to 1 1/2 tbl spoons

ఉప్పు - తగినంత

నిమ్మ జూసు - 1/2 tbl spoon

నీళ్ళు

కూర దింపేముందు :

కొత్తిమెర

ఉల్లిపాయలు - 1(ముక్కలు)

తయారు చేసే విధానం :

కూర తయారికి :


1.ముందుగ బీన్స్, క్యారట్, పచ్చిబఠానిలు వుడకబెట్టి దానిని కొంచెం చిదిమి పెట్టుకోవాలి.

2.పాన్ లో బట్టర్ వేసి వేడి చెయ్యాలి.

3.ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు, క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయముక్కలు, టొమటొ ముక్కలు వేసి వేయించాలి.

4.అందులో బంగాలదుంపను, పావ్ బజ్జి మసాల, కారం, ఉప్పు వేసి 2 నుంచి 3 నిమషాలు వేయించాలి.

5.ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసి కాసేపు వుడకనివ్వాలి.

6.ఇప్పుడు మంట మీద నుంచి దింపి అందులొ ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమెర, నిమ్మ జూసు వేసి కలపాలి.

పావ్ తయారికి :

1.ఇప్పుడు పావ్ ని రెండు సగాలుగ చేసి దాని మీద బట్టర్ వేసి, పాన్ వేడి చేసి పావ్ రెండు వైపులా వేయించాలి.

2.వేడి వేడి పావ్ బజ్జి ఆరగించండి.

Friday, April 27, 2007

పరవన్నం


కావలసినవి :

బియ్యం - 1 tea cup

పాలు - 7 tea cups

జీడిపప్పు - 2 to 3 tbl spoons

నెయ్యి - 1 tbl spoon

బెల్లం - 2 1/2 to 3 tea cups( కోరినది )

(అది బెల్లం తీపి బట్టి వుంటుంది.చూసుకొని వేసుకోవాలి.కొంచెం వేసి రుచి చూసుకుంటూ వేసుకొండి)

తయారు చేసే విధానం :


1.ఒక పాన్ లో నెయ్యి వేది చేసి జీడిపప్పు వేసి వేయించుకోవాలి.

2.బియ్యం కడిగి దానిలో పాలు పోసి కుకర్ లో 3 విసెల్స్ రానివ్వాలి.

3.అది కొంచెం వేడిగా వున్నప్పుడే ఇప్పుడు బెల్లం వేసి కలుపుకోవాలి.

4.ఇప్పుడు జీడిపప్పు వేసుకోవాలి.

5.వేడి వేడి పరవన్నం ఆరగించండి.

Wednesday, April 25, 2007

దొండకాయ వేపుడు

కావలసినవి :

దొండకాయలు - 1/2 kg

ఉల్లిపాయ - 1

ఆవాలు - 1 tbl spoon

పసుపు - చిటికెడు

కారం - 1/4 to 1/2 tbl spoon

కొబ్బరి పొడి - 1/4 to 1/2 tbl spoon

ఉప్పు - తగినంత

కరివేపాకు - 5

నునె - 3 to 4 tbl spoons

తయారు చేసే విధానం :

1.దొండకాయల్ని సన్నగ పొడుగ్గ కట్ చేసుకోవాలి.

2.ఇప్పుడు పాన్ లో నునె వేసి దానిలో ఆవాలు కరివేపాకు వేసి వేయించాలి.

3.అందులో ఉల్లిపాయ ముక్కలు(సన్నగ పొడుగ్గ)వేసి వేయించాలి.

4.ఇప్పుడు దొండకాయ ముక్కలు వేసి కొంచెం వేయించాక అందులో కారం, పసుపు, ఉప్పు వేసి (తక్కువ మంట మీద పెట్టి) దొండకాయ ఉడికేవరకు బాగా వేయించాలి.

5.ఇప్పుడు కొబ్బరి వేసి 5 నిమషాలు వేయించాలి.

6.దొండకాయ వేపుడునీ వేడి వేడి అన్నంతో ఆరగించండి.

Friday, April 06, 2007

శనగపప్పు కొబ్బరి కూర

కావలసినవి :

కొబ్బరి - 1 cup (125gms)

శనగపప్పు - 1/2 cup

ఉల్లిపాయ - 1

పచ్చిమిరపకాయలు - 2

ఎండుమిరపకాయలు - 3

పసుపు - చిటికెడు

ఉప్పు - తగినంత

కరివేపాకు - 3

ఆవాలు - 1/4

నునె - 2 to 3 tbl spoons


తయారు చేసే విధానం :

1.ముందుగా శనగపప్పుని కడగాలి. అందులో 1 కప్పు నీళ్ళు పోసి వేసి కుకర్ లో 1 విసెల్ రానివ్వాలి. ఆ తర్వాత అందులో నీళ్ళని తీసెయ్యాలి.

2.ఇప్పుడు పాన్ లో నునె వేసి వేడి చేసి అందులో ఆవాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి.

3.అందులో ఉల్లిపాయముక్కలు వేసి వేయించాలి. ఇప్పుడు వుడికించిన శనగపప్పుని, ఉప్పు, పసుపు వేసి వేయించాలి.

4.ఇప్పుడు కొబ్బరి వేసి 3 నిమషాలు వేయించి మంట మీద నుంచి దింపెయ్యాలి.

5.శనగపప్పు-కొబ్బరి కూర వేడి వేడి అన్నంతో ఆరగించండి.

Saturday, March 24, 2007

టొమటొ రైస్


కావలసినవి :

బాస్మతి రైస్ - 2 cups(250 gms)

టొమటోలు - 4

బఠాణిలు - 1/2 cup(నానబెట్టి,వుడికించాలి)

బంగాలదుంప - 1

ఉల్లిపాయ - 2 (సన్నగ పొడుగ్గ)

పచ్చిమిరపకాయలు - 4

అల్లం వెల్లుల్లి పేస్టు - 1 1/2 tbl spoon

లవంగాలు - 5

యాలకులు - 3

బిర్యాని ఆకు - 3

సాంబార్ పొడి - 1 1/2 or 2 tbl spoon

ఉప్పు - తగినంత

కొత్తిమెర

తయారు చేసే విధానం :


1.కూకర్ లో నునె వేసి వేడి చేసి అది వేడి అయ్యాక అందులో లవంగాలు, యాలకులు, బిర్యాని ఆకు వేసి వేయించాలి.

2.ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి.

3.అది వేయించాక అందులో అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించాలి.టొమటొ ముక్కలు వేసి వేయించాలి.

4.దానిలో బఠాణిలు,బంగాలదుంప ముక్కలు వేసి కొంచెంసేపు వేయించి అందులో సాంబార్ పొడి, ఉప్పు వేసి కలపాలి.

5.ఇప్పుడు బియ్యం కడిగి అందులో వేసి కొంచెంసేపు వేయించి అందులో నీళ్ళు(ఒక కప్పు బియ్యం కి 1 1/2 లేదా 2 కప్పు నీళ్ళు)పోసి ఒక విసెల్ రానివ్వాలి.

6.అందులో కొత్తిమెర వేసి కలపాలి.ఇప్పుడు వేడి వేడి టొమటొ రైస్ నీ ఆరగించండి.

Wednesday, March 21, 2007

క్యాప్సికం మసాల

కావలసినవి :


క్యాప్సికం - 2

ఉల్లిపాయలు - 2

పచ్చిమిరపకాయలు - 5

కారం - 1 tbl spoon

ధనియాలు - 1 tbl spoon

నువ్వులు - 1/4 cup

వేరుశనగుళ్ళు - 1/2 cup

కొబ్బరి - 1/2 cup (పొడి)

ఆవాలు - 1/4 tbl spoon

మెంతులు - చిటికెడు

చింతపండు - నిమ్మకాయంత(నీళ్ళల్లో నానబెట్టాలి)
ఉప్పు - తగినంత

నునె - 3 tbl spoons

కొత్తిమెర


తయారు చేసే విధానం :


1.పాన్ లో (నునె లేకుండ)ధనియాలు, వేరుశనగుళ్ళు, నువ్వులు, కొబ్బరి వేసి వేయించి దానిని మంట మీద నుంచి దింపి చల్లారబెట్టాలి.

2.ఇప్పుడు దానిని గ్రైండ్ చేసుకోవాలి (కొంచెం నీళ్ళు పోసి గ్రైండ్ చెయ్యాలి).

3.పాన్ లో నునె వేసి అందులో ఆవాలు, మెంతులు వేయించాలి.

4.ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు,పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి.

5.అందులో క్యాప్సికం ముక్కలు వేసుకొని వేయించాలి.

6.అది కొంచెం వేయించాక దానిలో గ్రైండ్ చేసి పెట్టుకున్న వేరుశనగుళ్ళు ముద్దనీ వేసి వేయించుకొవాలి.

7.అందులో కారం, ఉప్పు వేసి వేయించాలి.

8.ఇప్పుడు నానబెట్టి వుంచుకున్న చింతపండు పులుసు కొంచెం అందులో వేసి, అది కొంచెం గట్టి పడేవరకు వుంచాలి.

9.అలా కొంచెం గట్టిపడేక మంట మీద నుంచి దింపేముందు కొత్తిమెర వేయ్యాలి.

Thursday, March 15, 2007

కాలిఫ్లవర్ మంచురియా

కావలసినవి :

కాలిఫ్లవర్ - 1

( చిన్న చిన్న పువ్వులుగా కట్ చేసి పెట్టుకోవాలి )

ఉల్లిపాయలు - 2


అల్లం వెల్లుల్లి పేస్టు - 2 tbl spoons

కారం - 2 tbl spoons

పసుపు - చిటికెడు

ఉప్పు - తగినంత

పచ్చిమిర్చి పేస్టు - 3 tbl spoons

కొత్తిమెర - 1/2 కట్ట

రెడ్ ఫుడ్ కలర్ - చిటికెడు

సొయా సాస్ - 2 tbl spoons

కర్న్ ఫ్లోర్ - 2 tbl spoons

( 1 1/2 tbl spoon కర్న్ ఫ్లోర్ నీ నీళ్ళలో కలిపి వుంచాలి )

గోధుమ పిండి - 1 tbl spoon

బియ్యం పిండి - 1/2 cup

బేకింగ్ పౌడర్ - 1/2 tbl spoon

నిమ్మకాయ జూసు - 2 tbl spoons

నునె - వేయించడానికి


తయారు చేసే విధానం :

1.ఒక గిన్నెలో గొధుమ పిండి, బియ్యం పిండి, 1/2 tbl spoon కర్న్ ఫ్లోర్, బేకింగ్ పౌడర్, ఉప్పు, 1 tbl spoon సోయా సాస్, 1 tbl spoon అల్లం వెల్లుల్లి పేస్టు, 1 tbl spoon కారం, పసుపు, 1 tbl spoon పచ్చిమిర్చి పేస్టు, కొంచెం నీళ్ళు పోసి వేసి అన్ని కలుపుకోవాలి.

2.ఇప్పుడు కాలిఫ్లవర్ పువ్వులుగా కట్ చేసినవి ఇందులో వేసి కలపాలి.

3.పాన్ లో నునె నీ వేడి చేసి అందులో ఈ కాలిఫ్లవర్ పువ్వులను వేయించి పక్కన పెట్టుకోవాలి.

4. ఇప్పుడు పాన్ లో 3 tbl spoons నునె వేసి అందులొ ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.కొంచెం వేయించాక 1 tbl spoon అల్లుం వెల్లుల్లి పేస్టు, 2 tbl spoons పచ్చిమిర్చి పేస్టు, 1 tbl spoon కారం వేసి వేయించాలి.

5. అందులో 1 tbl spoon సోయా సాస్ వేసి వేయించాలి. ఇప్పుడు మంటను తగ్గించి దానిలో ముందుగా నీళ్ళలో కలిపి వుంచుకున్న కర్న్ ఫ్లోర్ నీ, రెడ్ ఫుడ్ కలర్ ని వేసి బాగా కలుపుకోవాలి.

6. అది అలా కలిపాక కొంచెం గట్టిపడుతుంది. ఇప్పుడు కొత్తిమెర వేసి కలపాలి.

7. అందులో కాలిఫ్లవర్, నిమ్మజూసునీ వేసి కలపాలి.

8. ఇప్పుడు వేడి వేడి కాలిఫ్లవర్ మంచురియా ఆరగించండి.

చేప వేపుడు

కావలసినవి :

చేప ముక్కలు - 4

కారం - 2 tbl spoons

ఉప్పు - తగినంత ( 1/2 tbl spoon )

నునె - వేయించడానికి

తయారు చేసే విధానం :

1. ముందుగా చేప ముక్కలను బాగా కడిగి నీళ్ళు పొయేవరకు వాటిని అలా వుంచాలి.

2. ఇప్పుడు కారం, ఉప్పు కలిపి 30 నిమషాలు పక్కన వుంచాలి.

3. ఇప్పుడు నునె నీ వేడి చేసి అందులో ఒక్కొక చెప ముక్కను అందులో వేసి వేయించాలి. కొంచెం వేగిన తరువాత చేప ముక్కలను తిసేయ్యాలి . వేడి వేడిగా ఆరగించండి.

Thursday, March 08, 2007

వెజ్ టబుల్ సమోసా



కావలసినవి :


సమోసా తయారి :


మైదా - 1 cup

నెయ్యి - 1/2 cup

బేకింగ్ పౌడర్ - 1/4 tbl spoon

ఉప్పు - తగినంత

నీళ్ళు


కూర తయారికి :



బంగాలదుంపలు - 2

( వుడికించిన బంగాలదుంపల్ని పొట్టు తిసేసి దానిని చేతితో చిదిపెయ్యాలి).

ఉలిపాయాలు - 1 ( ముక్కలు)

పచ్చి బఠానీలు - 1 cup

పచ్చిమిరపకాయలు - 2

కొత్తిమెర

నిమ్మ జూసు - 2 tbl spoon

పసుపు - 1/2 tbl spoon

గరం మసాల - 1/2 tbl spoon

కారం - 1 tbl spoon

ఆవాలు - 2 tbl spoons


అల్లం వెల్లుల్లి పేస్టు - 1 tbl spoon

ఉప్పు - తగినంత

నునె - వేయించడానికి

కరివేపాకు - 5


తయారు చేసే విధానం :


పిండి కి :


1. మైదా లో ఉప్పు,బేకింగ్ పౌడర్, నెయ్యి వేసి కలుపుకోవాలి.


2. కొంచెం నీళ్ళు పోసి చాలా మెత్తగా కలుపుకోవాలి.


3. కలిపిన పిండి ని 30 నిమషాలు పాటు తడిబట్టతో పెట్టి వుంచాలి.


కూర విధానం :



1. ఒక పాన్ లో నునె వేసి వేడి చెయ్యాలి. అందులో ఆవాలు, కరివేపాకు వేసి వేయించాలి.


2. అందులో ఉల్లిపాయముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. ఇప్పుడు పచ్చిబఠానిలు,అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాల,కొత్తిమెర,కారం, పసుపు, ఉప్పు వేసి వేయించాలి.


3. కొంచెం వేయించాక అందులో బంగాలదుంపను వేసి వేయించాలి.అందులో నిమ్మ జూసు వేసి కలుపుకోవాలి.


4. కలిపేసి పెట్టుకున్న మైదా ని మళ్ళీ బాగా కలుపుకోవాలి.


5. చపాతీ పిండిని నిమ్మకాయ సైజులో తీసుకునిచపాతీలా చేసి వాటిని సగానికి కట్ చేసి సగభాగాల మధ్యలో కూర మిశ్రమాన్ని పెట్టి త్రికోణపు ఆకారంలో మడవాలి.అంచులు గట్టిగ వత్తలి.


6. వాటిని కాగిన నూనెలో ఎర్రగా వేయించాలి.


7. సమొసా నీ టొమటో సాస్ తో తింటే బాగుంటుంది.

Thursday, March 01, 2007

చికెన్ ఫ్రై

కావలసినవి :

చికెన్ - 1/4 kg

కారం - 2 tbl spoons

అల్లం వెల్లుల్లి పేస్టు - 1tbl spoon

ఉప్పు - తగినంత

లవంగాలు - 4

ధనియాలు - 2 tbl spoons

ఎండుమిరపకాయలు - 8

(ఎండుమిరపకాయలు కారంగా వుంటే గనుక అప్పుడు 4 ఎండుమిరపకాయలు వేసుకొండి.)

యాలకులు - 2

దాల్చిన చెక్క - 1

ఆవాలు - 1 tbl spoon

కరివేపాకు - 5

ఉల్లిపాయలు - 2 (చిన్నవి)

నునె - 2 to 3 tbl spoons


తయారు చేసే విధానం :


1. చికెన్ నీ శుభ్రంగా కడిగి దానిలో అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు -1/2 tbl spoon వేసి కలిపి కూకర్ లో 2 విసెల్స్ రనివ్వాలి.( నేళ్ళు పొయ్యకూడదు ).

2. ఇపుడు పాన్ వేడి చేసి నునె లేకుండా వేడి చెయ్యాలి. అందులో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ధనియాలు, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. ఆ తరవాత చల్లారబెట్టాలి.

3. ఇప్పుడు పాన్ లో నునె - 1 tbl spoon వేసి అందులో ఉల్లిపాయముక్కలు వేసి వేయించాలి.

4. ఇప్పుడు వేయించి పెట్టుకున్న మసాల దినుసులు గ్రైండ్ చేసుకోవాలి. అది గ్రైండ్ చేసిన తరువాత దానిలో వేయించిన ఉల్లిపాయముక్కలను కూడా వేసి గ్రైండ్ చెయ్యాలి( నీళ్ళు లేకుండా గ్రైండ్ చేసుకోవాలి).

5. ఇప్పుడు పాన్ లో నునె - 2 tbl spoons వేసి వేడి చెయ్యాలి. అందులో ఆవాలు, కరివేపాకు వేసి వేయించాలి.

6. అందులో వుడికించిన చికెన్ నీ వేసి వేయించాలి( అందులో నీళ్ళు అయ్యేవరకు వేయించాలి ).

7. ఇప్పుడు గ్రైండ్ చెసి పెట్టుకున్న వుల్లిపాయ ముద్దను అందులో వేసి వేయించాలి. అది బాగా వేగే వరకు వేయించి దింపెయ్యాలి.