Wednesday, November 29, 2006

బంగాలదుంప కూర


కావలసినవి :




బంగాలదుంపలు - 2


ఉల్లిపాయలు - 2


పచ్హిమిరపకాయలు - 4


అల్లంవెల్లుల్లి పేస్టు - 1/2 tbl spoon


గరం మసాలా - 1/2 tbl spoon


కారం - 1 tbl spoon


ఉప్పు


పసుపు
నునె - 3 tbl spoons.

కొత్తిమెర




తయారుచేసే విదానం :




1. ఒక పాన్ లో నునే వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు , పచ్హిమిరపకాయలు వేసి వేయించాలి . అది కొంచం వేగాక అందులో అల్లంవెల్లులి పేస్టు , గరం మసాల వేసి వేయించాలి .



2. ఇప్పుడు బంగాలదుంప ముక్కలు అందులో వేసి వేయించాలి . అది వేగాక అందులో కారం , పసుపు , ఉప్పు వేసి వేయించాలి .



3. ఇప్పుడు అందులో నీల్లు వేసి మొత పెట్టాలి. బంగాలదుంప ముక్కలు వుడికినాక దింపేముందు కొత్తిమెర వెయ్యాలి.


Thursday, November 23, 2006

కాలిఫ్లవర్ టొమటో కూర



కావలసినవి :


కాలిఫ్లవర్ - 1

ఉల్లిపాయలు - 2

పచ్చిమిరపకాయలు - 6

టొమటొ - 2 లేదా 3

కారం - 1 to 1 1/2 tbl spoon

పసుపు

ఉప్పు - తగినంత

నునె - 3 tbl spoons
ఆవాలు - 2 tbl spoons




తయారు చేసే విధానం :




1. ఒక పాన్ లో నునె వేసి అది వేడి చెయ్యాలి . అందులో ఆవాలు , ఉల్లిపాయముక్కలు , పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి .



2. ఇప్పుడు అందులో కాలిఫ్లవర్ ముక్కలు వేసి వేయించాలి ( కాలిఫ్లవర్ని చిన్న పువ్వులుగా విడధీసి పెట్టుకోవాలి ) .




3. అందులో టొమటొ ముక్కలు వేసి దాని మీద మోత పెట్టి వేయించాలి . అందులో కారం , పసుపు , ఉప్పు వేసి కలపాలి . అందులో కొంచెం నీళ్ళు వేసి కాలిఫ్లవర్ ముక్కలు వుడికేవరకు వుంచి దింపేయ్యాలి .

Wednesday, November 22, 2006

చిలకడదుంప కొడిగుడ్డు పులుసు


కావలసినవి :



కొడిగుడ్డ్ల్లు - 2 (వుడకబెట్టినవి)

చిలకడదుంపలు - 2

ఉల్లిపాయలు -2

పచ్చిమిరపకాయలు - 5

కారం- 1/2 to 1 tbl spoon

పసుపు

ఉప్పు - తగినంత

పంచదార - 1/2 tbl spoon

చింతపండు - 1/2 నిమ్మకాయంత

నునె - 5 tbl spoons





తయారు చేసే విధానం :



1. ఒక పాన్ లో 2 tbl spoons నునె వేసి అది వేడి చేసి అందులో పసుపు , కొడిగుడ్డ్ళ్ళు ( కొడిగుడ్డు పెచ్చు తిసేయ్యాలి ) వాటిని వేయించి తీసెయ్యాలి .


2. ఇప్పుడు అదే పాన్ లో 3 tbl spoons నునె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు , పచ్హిమిరపాకాయలు వేసి వేయించాలి . అవి వేగాక అందులో చిలకడదుంపలు ( వాటి తొక్క తిసేసి దానిని చక్రాలుగా కోసుకోవాలి ) వేసి వేయించాలి .


3. ఇప్పుడు కారం , ఉప్పు వేసి కలపాలి . అందులో చింతపండు రసం వేసి ఇంకొంచెం నీళ్ళు , పంచదార వేసి మరగబెట్టాలి . అంటే చిలకడదుంపలు వుడికేవరకు వుంచి దింపేయాలి .

Sunday, November 19, 2006

బంగాలదుంప వేపుడు


కావలసినవి :



బంగాలదుంపలు - 2 ( సన్నటి ముక్కలు )


ఉల్లిపాయలు - 2


ఎండుమిరపకాయలు - 6


జీలకర్ర - 1 tbl spoon


వెల్లుల్లి


కారం - 1/2 to 1 tbl spoon


పసుపు


ఉప్పు -సరిపడినంత


కరివేపాకు


నునె - 5 to 7 tbl spoons


ఆవాలు - 1 tbl spoon






తయారుచేసే విధానం :




1. ముందుగ జీలకర్ర , వెల్లుల్లి , ఎండుమిరపకాయలు - 5 గ్రైండ్ చెయ్యాలి . అందులో ఉల్లిపాయముక్కలు వేసి గ్రైండ్ చెయ్యాలి .




2. ఇప్పుడు పాన్ లో నునేను వేసి అది వేడి అయ్యాక అందులో ఆవాలు , కరివేపాకు , ఎండుమిరపకాయ - 1 వేసి వేయించాలి . ఇప్పుడు ఉల్లిపాయముద్దను వేసి బాగా ఫ్రై చెయ్యాలి .



3. అది కొంచెం వేగాక అందులో బంగాలదుంప ముక్కలు వేసి వేయించాలి . అందులో కారం , పసుపు , ఉప్పు వేయ్యలి .



4. ఇంక అది వేయిస్తూ అప్పుడప్పుడు ఆ పాన్ మీద మోత పెట్టి వేయించాలి . అలా చేస్తే బంగాలదుంప ముక్కలు వుడుకుతాయి . అలా బంగాలదుంప ముక్కలు వుడికేవరకు వుంచాలి .



వేరుశనగ చట్ట్ని


కావలసినవి :




వేరుశనగ గుళ్ళు - 2 tea cups


కొబ్బరి పొడి - 1 tea cup


పుట్నాల పప్పు - 1/2 tea cup ( వేపిన శనగపప్పు )


పచ్చిమిరపకాయలు - 12


నునె - 3 tbl spoons


జీలకర్ర - 2 tbl spoons


ఆవాలు - 1 tbl spoon


ఎండుమిరపకాయలు - 3


శనగపప్పు - 1 tbl spoon


మినపప్పు - 1 tbl spoon


వెల్లుల్లి


ఉప్పు - సరిపడినంత


కరివేపాకు


చింతపండు - 3 to 4 inch






తయారు చేసే విధానం :


1. ఒక పాన్ లో వేరుశనగ గుళ్ళు వేసి వేయించాలి . అది వేగిన తరవాత దానిని చల్లారబెట్టాలి.



2. ఒక పాన్ లో 1 tbl spoon నునె వేసి వేడి చేయ్యాలి . అందులో జీలకర్ర , వెల్లుల్లి , పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి . అది వేగిన తరవాత దానిని చల్లారబెట్టాలి .



3. ఇప్పుడు వేయించిన జీలకర్ర , వెల్లుల్లిపాయ , పచ్చిమిరపకాయలు గ్రైండ్ చెయ్యాలి. అందులో వేయించిన వేరుశనగ గుళ్ళు , కొబ్బరి పొడి , పుట్నాల పప్పు , ఉప్పు , చింతపండు వేసి గ్రైండ్ చెయ్యాలి . అందులో నీళ్ళు 1/2 to 1 cup వేసి గ్రైండ్ చేయ్యాలి.

4. ఇప్పుడు పాన్లో 2tblspoons నునె వేసి ఆవాలు , శనగపప్పు , మినపప్పు , కరివేపాకు , ఎండుమిరపకాయలు వేసి వేయించాలి . అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న వేరుశనగ మిశ్రమంలొ ఆ పోపు నీ వేసి కలపాలి .



5. ఆ వేరుశనగ చట్ట్ని నీ ఇడ్లి తో లేదా దోస తో తింటే బాగుంటుంది.

Thursday, November 16, 2006

సేమియా ఉప్మ


కావలసినవి :



సేమియా - 2 cups

ఉల్లిపాయలు - 1 ( సన్నగ పొడుగ్గ )

పచ్చిమెరపకాయలు - 7

శనగపప్పు - 2 tbl spoon

మినపప్పు - 1 tbl spoon

ఆవాలు - 1 tbl spoon


జీడిపప్పు - 2 tbl spoon

నునె - 2 tbl spoon

కరివేపాకు

నీళ్ళు - 3 cups

ఉప్పు - సరిపడినంత



తయారు చేసే విధానం :



1. ఒక పాన్ లో 1 tbl spoon నునె వేసి అది వేడి అయ్యాక అందులో సేమియా వేసి వేయించి తిసేయ్యాలి .


2. ఇప్పుడు అదే పాన్ లో మిగతా నునె వేసి అందులో ఆవాలు , శనగపప్పు , మినపప్పు , జీడిపప్పు , కరివేపాకు వేసి వేయించాలి .


3. ఇప్పుడు సన్నగ పొడుగ్గ వుల్లిపాయలు కోసి అవి ఆ నునె లో వేసి , పచ్చిమెరపకాయలు , కరివేపాకు వేసి వేయించాలి .


4. ఇప్పుడు 3 cups నీళ్ళు పోసి అందులో ఉప్పు వేసి కాసేపు మరగనివ్వాలి .


5. నీళ్ళు మరిగిన తరవాత మంట కొంచెం తక్కువ పెట్టీ అందులో సేమియా వేసి కలపాలి .


6. ఇప్పుడు దాని మీదా మోత పెట్టీ 10 నిమషాలు వుంచాలి ( అంటె సేమియా దగ్గరగా అయ్యేవరకు వుంచాలి.)

కైమ కర్రి


కావలసినవి :


కైమ - 1/2 kg


ఉల్లిపాయలు - 3


పచ్హిమిరపకాయలు - 5


అల్లంవెల్లుల్లి పేస్టు -1 1/2 tbl spoon


గరం మసాలా - 1/2 tbl spoon


కారం - 1 tbl spoon


ఉప్పు


పసుపు


కొత్తిమెర



తయారుచేసే విదానం :


1. ఒక పాన్ లో నునే వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు , పచ్హిమిరపకాయలు వేసి వేయించాలి . అది కొంచం వేగాక అందులో అల్లంవెల్లులి పేస్టు , గరం మసాల వేసి వేయించాలి .


2. ఇప్పుడు కైమ అందులో వేసి వేయించాలి . అది వేగాక అందులో కారం , పసుపు , ఉప్పు వేసి వేయించాలి .


3. ఇప్పుడు అందులో నీల్లు వేసి మొత పెట్టాలి . కైమ వుడికినాక దింపేముందు కొత్తిమిర వెయ్యాలి .

Tuesday, November 14, 2006

పప్పు బీరకాయ


కావలసినవి :


పప్పు - 1 cup

బీరకాయ - 1

మీల్ మేకెర్ - 10 to 15

పచ్చిమిరపకాయలు - 12

జీలకర్ర - 1 tbl spoon

పసుపు

ఉప్పు - తగినంత

నునె - 4 tbl spoon

ఆవాలు - 1 tbl spoon

ఎండుమిరపకాయలు - 2

కరివేపాకు - 2 రెమ్మలు

వెల్లుల్లి




తయారు చేసే విధానం :



1. ముందు బీరకాయ తొక్క తిసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి . ఇప్పుడు కూకెర్ లో పప్పు ని కడిగి అందులో బీరకాయ ముక్కలు , జీలకర్ర , 2 cups నీళ్ళు పోసి 3 విసెల్స్ లు రానివ్వాలి.


2. ఇప్పుడు ఆ పప్పు లో కొంచెం 1/4 cup నీళ్ళు పోసి అందులో ఉప్పు , పసుపు వేసి కలపాలి .


3. ఇప్పుడు ఒక పాన్ లో 2 tbl spoon నునె వేసి అందులో మీల్ మేకెర్ ని వేయించాలి . అంటే కొంచెం ఎర్రగా వేయించాలి.


4. ఆ వేయించిన మీల్ మేకెర్ ని పప్పు లో వేయ్యాలి ( అది 15నిమషాలు ముందు పప్పు లో వేస్తే మీల్ మకెర్ మెత్తగా అవ్వుతాయి ) .


5. ఇప్పుడు పాన్ లో 2 tbl spoon నునె వేసి అందులో ఆవాలు , కరివేపాకు ,ఎండుమిరపకాయలు , పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి . ఆ పోపు ని పప్పు లో వేసి కలపాలి. పప్పు మీద మోత పెట్టి దానిని స్టవ్వు మీద 5 నిమిశాలు పెట్టి దించేయాలి.



6. పప్పు బీరకాయ నీ వేడి వేడి అన్నం , నెయ్యి , ఆవకాయ తో తింటే బాగుంటుంది .

Monday, November 13, 2006

రవ్వ దొస



కావలసినవి :


గొధుమ నూక - 1 cup

బియ్యంపిండి - 1 cup

మైదా - 1/4 cup

జీలకర్ర - 2 tbl spoons

పెరుగు - 1 tbl spoon

ఉల్లిపాయ - 1 (ముక్కలు)

పచ్హిమీరపకాయలు - 3 ( ముక్కలు )

నునె - 3 tbl spoons

ఉప్పు - 1 to 1 1/2 tbl spoon




తయారు చేసే విధానం :



1. ఒక గిన్నెలో గొధుమ నూక , బియ్యం పిండి , మైదా , జీలకర్ర , ఉప్పు , పెరుగు , నీళ్ళు వేసి బాగా పల్చగా కలుపుకోవాలి . అల కలుపుకున్నాక ఒక 30 నిమషాలు వుంచాక అప్పుడు దొస వేసుకోవాలి .


2. ఇప్పుడు పాన్ నీ వేడి చేసి దాని మీద రవ్వ దొస వేసి , దాని పైన ఉల్లిపాయ ముక్కలు , పచ్చిమిరపకాయ ముక్కలు వేయ్యాలి.


3. నునె నీ దొస చుట్టూ , మీద వేయ్యాలి . ఇప్పుడు వెనక్కి తిప్పి 2 నిమషాలు వేగనివ్వాలి .


4. ఆ రవ్వ దొస , కొబ్బరి పచ్హడీ తో తింటే బాగుంటుంది .

Saturday, November 11, 2006

కేబేజి పచ్చడి


కావలసినవి :



కేబేజి - 1/2

పచ్చిమిరపకాయలు - 10

నునె - 5 tbl spoon

జీలకర్ర - 1 tbl spoon

ఆవాలు - 1 tbl spoon

ఎండుమిరపకాయలు - 3

శనగపప్పు - 1 tbl spoon

మినపప్పు - 1 tbl spoon

వెల్లుల్లి

ఉప్పు - 1 or 1 1/2 tbl spoon

కరివేపాకు

చింతపండు - 2 inch

ఉల్లిపాయ - 1



తయారు చేసే విధానం :



1. ఒక పాన్ లో 2 tbl spoons నునె వేసి వేడి చేయ్యలి. అందులో కట్ చేసిన కేబేజి ముక్కలు , పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. అది వేగిన తరవాత దానిని చల్లారబెట్టాలి.


2. ఇప్పుడు జీలకర్ర , వెల్లుల్లిపాయ గ్రైండ్ చెయ్యాలి. అందులో వేయించిన కేబేజి , పచ్చిమిరపకాయలు , ఉప్పు , చింతపండు వేసి గ్రైండ్ చెయ్యాలి. ( నీళ్ళు అవసరం అనుకుంటే 1/2 గ్లాసు కన్న తక్కువ వేసి గ్రైండ్ చేయ్యాలి).


3. ఇప్పుడు పాన్ లో 3 tbl spoons నునె వేసి అందులో ఆవాలు ,శనగపప్పు , మినపప్పు ,కరివేపాకు ,ఎండుమిరపకాయలు వేసి వేయించాలి . అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న కేబేజి మిశ్రమాన్ని వేసి బాగా వేయించాలి . (అంటె గ్రైండ్ చేసినప్పుడు కొంచెం పల్చగా వుంతుండి , అందుకని నునె లో వేయిస్తె బాగా గట్టిగా అవ్వుతాది).



4. ఉల్లిపాయ ముక్కలు ఆ పచ్చడి లో కలిపి వేడి అన్నం , నెయ్యి తో తింటే బాగుంటుంది.

Thursday, November 09, 2006

పెసరట్టు ఉప్ప్మ అల్లం పచ్హడి



పెసరట్టు కి కావలసినవి :


పెసరపప్పు - 2 cups

అల్లుం - చిన్న ముక్క

పచ్చిమిరపకాయలు - 10

ఉప్పు - 2 tbl spoon

జీలకర్ర - 2 tbl spoon

నునె / నెయ్యి - 4 tbl spoon



పెసరట్టు పైన వేయ్యడానికి :



ఉల్లిపాయలు - 2 ( ముక్కలు )

పచ్చిమిరపకాయలు - 4 ( ముక్కలు )



తయారు చేసే విధానం :


1. పెసరపప్పు నీ 4 నుంచి 5 గంటలు నానబెట్టి శుభ్రంగా కడిగి అందులో 6 పచ్చిమిరపకాయలు , అల్లం ముక్క , ఉప్పు వేసి మెత్తగ గ్రైండ్ చేసుకోవాలి .


2. అందులో జీలకర్ర కొంచెం నిళ్ళు వేసి కలుపుకోవాలి.


3. ఇప్పుడు పాన్ నీ వేడి చేసి దాని మీద పెసరట్టు వేసి , దాని పైన ఉల్లిపాయ ముక్కలు , పచ్చిమిరపకాయ ముక్కలు వేయ్యాలి.


4. నునె / నెయ్యి నీ పెసరట్టు చుట్టూ , మీద వేయ్యాలి.


5. పెసరట్టు నీ ఉప్ప్మ , అల్లం చట్ట్నీ తో తింటే బాగుంటుంది.



ఉప్ప్మ కి కావలసినవి :



గొధుమ నూక - 1 cup

ఉల్లిపాయలు - 1 ( సన్నగ పొడుగ్గ )

పచ్చిమెరపకాయలు - 5

శనగపప్పు - 2 tbl spoon

మినపప్పు - 1 tbl spoon

ఆవాలు - 1 tbl spoon

అల్లం - చిన్న ముక్క

నునె - 2 tbl spoon

కరివేపాకు

నీళ్ళు - 2 cups

ఉప్పు - సరిపడినంత



తయారు చేసే విధానం :


1. ఒక పాన్ లో నునె వేసి అది వేడి అయ్యాక అందులో ఆవాలు , శనగపప్పు , మినపప్పు , కరివేపాకు వేసి వేయించాలి .


2. ఇప్పుడు సన్నగ పొడుగ్గ వుల్లిపాయలు కోసి అవి ఆ నునె లో వేసి , పచ్చిమెరపకాయలు , అల్లం ముక్కలు , కరివేపాకు వేసి వేయించాలి .

3. ఇప్పుడు 2 cups నీళ్ళు పోసి అందులో ఉప్పు వేసి కాసేపు మరగనివ్వాలి.

4. నీళ్ళు మరిగిన తరవాత మంట కొంచెం తక్కువ పెట్టీ అందులో ఉప్ప్మ రవ్వ వేసి పక్క నుంచి వేరే గరిటి తో కలుపుతు ఆ రవ్వ వేసి కలపాలి.


5. ఇప్పుడు మంట ఆపేసీ దాని మీదా మోత పెట్టీ 5 నిమషాలు వుంచాలి.


6. ఇప్పుడు ఉప్ప్మ నీ పెసరట్టు , అల్లం చట్ట్నీ తో తింటే బాగుంటుంది.



అల్లం పచ్హడి కావలసినవి :


శనగపప్పు - 2 tbl spoon

మినపప్పు - 2 tbl spoon

ధనియాలు - 1 tbl spoon

జీలకర్ర - 1 tbl spoon

చింతపండు - చిన్న నిమ్మకాయంత

అల్లం - 3 inch piece

ఉప్పు - సరిపడినంత

పచ్చిమిరపకాయలు - 12 ( సన్నగ పొడుగ్గ )

బెల్లం - 1 1/2 cubes

నునె - 3 tbl spoon



అల్లం పచ్చడి తయారు చేసే విధానం :



1. పాన్ లో నునె వేసి అందులో శనగపప్పు , మినపప్పు ,దనియాలు , జీలకర్ర , పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి.

2. ఇప్పుడు అల్లం వేసి కొంచెం వేయించి ఆపేయ్యాలి.



3. ఇప్పుడు అది చల్లరబెట్టి అందులో చింతపండు , ఉప్పు , బెల్లం వేసి అందులొ కొంచెం నిళ్ళూ వేసి మెత్తగా గ్రైండ్ చెయ్యాలి .


4. అల్లం పచ్హడి , పెసరట్టు , ఉప్ప్మ తో తింటే బాగుంటుంది.

Wednesday, November 08, 2006

పాలకూర పప్పు




కావలసినవి :


కందిపప్పు - 1 cup

పాలకూర- 1 bunch

( పాలకూర ఆకులు విడదీసి శుబ్రంగా కడగాలి )


పచ్చిమిరపకాయలు - 10

పసుపు

ఉప్పు

నునె - 1 tbl spoon

ఆవాలు - 1 tbl spoon

జీలకర్ర - 1 tbl spoon

వెల్లుల్లి

ఎండుమిరపకాయలు - 1 or 2

కరివేపాకు


చింతపండు - 1/2 నిమ్మకాయంత





తయారు చేసే విధానం :



1. కుకర్ లో కందిపప్పు , పాలకూర , పచ్చిమిరపకాయలు ,చింతపండు ,పసుపు , 2 కప్పుల నీల్లు పోసి 4 విసెల్ల్స్ రానివ్వాలి.


2. ఇప్పుడు కుకర్ ఆవిరి పోయిన తర్వాత ఆ పప్ప్పు లో ఉప్పు వేసి కలుపుకోవాలి.


3. ఒక పాన్ లో నునె వేసి అందులో వెల్లుల్లి , ఆవాలు , జీలకర్ర ,ఎండుమిరకాయలు , కరివేపాకు వేసి వేయించాలి.


4. ఇప్పుడు ఈ పోపు నీ పప్పు లో వేయ్యాలి. పప్పు మీద మోత పెట్టి దానిని స్టవ్వు మీద 5 నిమిశాలు పెట్టి దించేయాలి.


5. పప్పు పాలకూర వేడి వేడి అన్నం , నెయ్యి , ఆవకాయ తో తింటే బాగుంటుంది.

లడ్డు


కావలసినవి :


శనగపిండి - 1 cup

పంచదార పొడి - 1/2 cup

యాలకుల పొడి - 1 tbl spoon

నెయ్యి - 1/2 cup ( కరగబెట్టినది)

జీడిపప్పు




తయారు చేసే విధానం :




1. ముందుగా ఒక పాన్ లో 2 tbl spoon నెయ్యిని వేడి చేసి అందులో శనగపిండి వేసి తక్కువ మంట పెట్టి వేయించాలి. (పచ్హివాసన పొయేవరకు వేపాలి ).



2. అది వేపడం అయ్యాక దానిని చల్లారబెట్టాలి. అందులో పంచదార పొడి , యాలకుల పొడి , నెయ్యి వేయ్యాలి. ఇప్పుడు దానిని బాగా కలుపుకోవాలి. అలా కలిపిన తరవాత దానిని వుండలుగ (లడ్డు) చేసుకొవాలి.



3. దాని పైన జిడిపప్పు పెట్టాలి . ఈప్పుడు లడ్డు తయారు అయ్యినట్టు.

Monday, November 06, 2006

గారెలు



కావలసినవి :


మినపప్పు - 2 cups {500 gms}

ఉల్లిపాయలు - 3

పచ్చిమిరపకాయలు - 5

జీలకర్ర - 2 tbl spoon

కొత్తిమీర - 1 bunch

ఉప్పు

నునె



తయారు చేసే విధానం :




1. మినపప్పుని 3 - 4 గంటలు నానబెట్టాలి . మినపప్పుని గట్టీగా రుబ్బాలి . అలా చేస్తే ఆ పిండి నునెను పీల్చకుండ వుంటుంది.


2. ఇప్పుడు ఆ పిండిలో ఉప్పు , జీలకర్ర , ఉల్లిపాయముక్కలు , పచ్చిమిరపకాయలు , కొత్తిమీర వేసి బాగా కలపాలి .


3. ఇప్పుడు పాన్ లో నునేను వేసి బాగా వేడి చెయ్యాలి . ఆ పిండిని ఒక పొలతిన్ కవరు మీద గారెలుగ చేసి అది నునే లో వేయించాలి . కొబ్బరి చట్ట్ని తో తింటే బాగుంటుంది.

Sunday, November 05, 2006

మసాల దోస


కావలసినవి :


ఉడికించిన బంగాలదుంపలు - 2

ఉల్లిపాయలు - 2

పచ్చిమెరపకాయలు - 5

నిమ్మకాయ - 1

ఉప్పు

పసుపు

నునె

ఆవాలు - 1 tbl spoon

శనగపప్పు - 1 tbl spoon

కరివేపాకు

కొత్తిమీర



తయారు చేసే విధానం :



1. ఒక పాన్ లో నునేను వేడి చేసి అందులో ఆవాలు , శనగపప్పు , కరివేపాకు , పచ్చిమెరపకాయలు వేసి బాగా వేయించాలి .


2. ఇప్పుడు ఉల్లిపాయముక్కలు , పసుపు వేసి వేయించాలి.


3. బంగాలదుంపలను వుడకబెట్టి దానిపొట్టు తిసేయ్యాలి . ఇప్పుడు దానిని బాగా నుజ్జు నుజ్జు చేయ్యాలి. ఇప్పుడు ఉల్లిపాయముక్కలు వేగినాక అందులో ఆ బంగాలదుంప మిశ్రమాన్ని , కొంచెం ఉప్పు వేసి వేయించాలి.


4. ఇప్పుడు నిమ్మకాయ రసమ్ని వేసి కలపాలి.


5. ఆ మసాల కూరని దింపేముందు కొత్తిమీర వేసి కలపాలి.


6. ఇప్పుడు ఒక పెనం పైన దోస వేసి అది తిరగేసి దాని పైన మసాల కూరని వేసి ఆరగించండి. ఇది కొబ్బరి చట్ట్ని తో తింటే బాగుంటుంది.

Saturday, November 04, 2006

కోడిగుడ్డు కూర


కావలసినవి :


కోడిగుడ్లు - 4

ఉల్లిపాయలు - 2

టొమటో - 2

అల్లుంవెల్లుల్లి పేస్టు - 2 tbl spoons

కారం - 2 tbl spoons

పసుపు చిటికెడు

ఉప్పు - 1 to 1 1/2 tbl spoons

ధనియాల పొడి - 2 tbl spoons

నునె - 4 spoons

కొత్తిమెర



తయారు చేసేవిధానం :


1. ఒక పాన్ లో నునె - 1 tbl spoon వేసీ అది వేడి అయ్యాక అందులో కొంచెం పసుపు, గుడ్లు ( వుడకబెట్టినవి ) వేసి వేయించి తిసేయ్యాలి.


2. ఇప్పుడు ఆ పాన్ లో కొంచెం నునెను - 3 tbl spoons వేసి అందులో ఉల్లిపాయలు, అల్లుంవేల్లుల్లి పేస్టు వేసి బాగా వేయించాలి.


3. ఇప్పుడు టొమటో ముక్కలు వేసి కొంచెంసేపు వేయించాలి. అందులో కారం , ఉప్పు, ధనీయాల పొడి వేసి వేయించాలి. ఇప్పుడు గుడ్డ్ల్లు ని కూడా అందులో వేసి బాగా కలపాలి .

4. ఇప్పుడు కొంచెం నీల్లుపోసి అది వుడికేవరకు అంటె నునె పైకి వచ్చేవరకు వుంచాలి. కూర దింపేముందు అందులో కొత్తిమెర వేయ్యాలి.

Thursday, November 02, 2006

చికెన్ కర్రి



కావలసినవి :

చికెన్ - 1/2 kg

ఉల్లిపాయలు - 4

పచ్హిమిరపకాయలు -5

అల్లంవెల్లుల్లి పేస్టు - 2 tbl spoon

గరం మసాలా -1 1/2 tbl spoon

కారం - 1 1/2 tbl spoon

ఉప్పు

పసుపు

కొత్తిమెర



తయారుచేసే విదానం :

1. ఒక పాన్ లో నునే వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు , పచ్హిమిరపకాయలు వేసి వేయించాలి. అది కొంచం వేగాక అందులో అల్లంవెల్లులి పేస్టు , గరం మసాల వేసి వేయించాలి.

2. ఇప్పుడు చికెన్ ముక్కలు అందులో వేసి వేయించాలి. అది వేగాక అందులో కారం , పసుపు , ఉప్పు వేసి వేయించాలి.

3. ఇప్పుడు అందులో నీల్లు వేసి మొత పెట్టాలి. చికెన్ వుడికినాక దింపేముందు కొత్తిమెర వెయ్యాలి.