Saturday, November 04, 2006

కోడిగుడ్డు కూర


కావలసినవి :


కోడిగుడ్లు - 4

ఉల్లిపాయలు - 2

టొమటో - 2

అల్లుంవెల్లుల్లి పేస్టు - 2 tbl spoons

కారం - 2 tbl spoons

పసుపు చిటికెడు

ఉప్పు - 1 to 1 1/2 tbl spoons

ధనియాల పొడి - 2 tbl spoons

నునె - 4 spoons

కొత్తిమెర



తయారు చేసేవిధానం :


1. ఒక పాన్ లో నునె - 1 tbl spoon వేసీ అది వేడి అయ్యాక అందులో కొంచెం పసుపు, గుడ్లు ( వుడకబెట్టినవి ) వేసి వేయించి తిసేయ్యాలి.


2. ఇప్పుడు ఆ పాన్ లో కొంచెం నునెను - 3 tbl spoons వేసి అందులో ఉల్లిపాయలు, అల్లుంవేల్లుల్లి పేస్టు వేసి బాగా వేయించాలి.


3. ఇప్పుడు టొమటో ముక్కలు వేసి కొంచెంసేపు వేయించాలి. అందులో కారం , ఉప్పు, ధనీయాల పొడి వేసి వేయించాలి. ఇప్పుడు గుడ్డ్ల్లు ని కూడా అందులో వేసి బాగా కలపాలి .

4. ఇప్పుడు కొంచెం నీల్లుపోసి అది వుడికేవరకు అంటె నునె పైకి వచ్చేవరకు వుంచాలి. కూర దింపేముందు అందులో కొత్తిమెర వేయ్యాలి.

1 comment:

బందరుబ్లాగరుడు said...

సూపర్ హిట్టండి. మీ లిస్ట్ ప్రకారం ఈ రోజు కర్రీ చెసా ఇంకా సిల్వర్ జూబ్లీ ఆడుతుంది. నేను జపాన్ లొ ఉంటాను. అందుకె స్వయంపాకం. ఇక్కడ వీళ్ళు అన్నం తప్పా అన్నీ తింటారు లేండి.అందుకే Hotelకి వెళ్ళలేము. ఇంక ఎమైనా మంచి కర్రీస్ ఉంటె పొస్ట్ చేయండి.