
కావలసినవి :
ఉడికించిన బంగాలదుంపలు - 2
ఉల్లిపాయలు - 2
పచ్చిమెరపకాయలు - 5
నిమ్మకాయ - 1
ఉప్పు
పసుపు
నునె
ఆవాలు - 1 tbl spoon
శనగపప్పు - 1 tbl spoon
కరివేపాకు
కొత్తిమీర
తయారు చేసే విధానం :
1. ఒక పాన్ లో నునేను వేడి చేసి అందులో ఆవాలు , శనగపప్పు , కరివేపాకు , పచ్చిమెరపకాయలు వేసి బాగా వేయించాలి .
2. ఇప్పుడు ఉల్లిపాయముక్కలు , పసుపు వేసి వేయించాలి.
3. బంగాలదుంపలను వుడకబెట్టి దానిపొట్టు తిసేయ్యాలి . ఇప్పుడు దానిని బాగా నుజ్జు నుజ్జు చేయ్యాలి. ఇప్పుడు ఉల్లిపాయముక్కలు వేగినాక అందులో ఆ బంగాలదుంప మిశ్రమాన్ని , కొంచెం ఉప్పు వేసి వేయించాలి.
4. ఇప్పుడు నిమ్మకాయ రసమ్ని వేసి కలపాలి.
5. ఆ మసాల కూరని దింపేముందు కొత్తిమీర వేసి కలపాలి.
6. ఇప్పుడు ఒక పెనం పైన దోస వేసి అది తిరగేసి దాని పైన మసాల కూరని వేసి ఆరగించండి. ఇది కొబ్బరి చట్ట్ని తో తింటే బాగుంటుంది.
No comments:
Post a Comment