Thursday, November 09, 2006

పెసరట్టు ఉప్ప్మ అల్లం పచ్హడి



పెసరట్టు కి కావలసినవి :


పెసరపప్పు - 2 cups

అల్లుం - చిన్న ముక్క

పచ్చిమిరపకాయలు - 10

ఉప్పు - 2 tbl spoon

జీలకర్ర - 2 tbl spoon

నునె / నెయ్యి - 4 tbl spoon



పెసరట్టు పైన వేయ్యడానికి :



ఉల్లిపాయలు - 2 ( ముక్కలు )

పచ్చిమిరపకాయలు - 4 ( ముక్కలు )



తయారు చేసే విధానం :


1. పెసరపప్పు నీ 4 నుంచి 5 గంటలు నానబెట్టి శుభ్రంగా కడిగి అందులో 6 పచ్చిమిరపకాయలు , అల్లం ముక్క , ఉప్పు వేసి మెత్తగ గ్రైండ్ చేసుకోవాలి .


2. అందులో జీలకర్ర కొంచెం నిళ్ళు వేసి కలుపుకోవాలి.


3. ఇప్పుడు పాన్ నీ వేడి చేసి దాని మీద పెసరట్టు వేసి , దాని పైన ఉల్లిపాయ ముక్కలు , పచ్చిమిరపకాయ ముక్కలు వేయ్యాలి.


4. నునె / నెయ్యి నీ పెసరట్టు చుట్టూ , మీద వేయ్యాలి.


5. పెసరట్టు నీ ఉప్ప్మ , అల్లం చట్ట్నీ తో తింటే బాగుంటుంది.



ఉప్ప్మ కి కావలసినవి :



గొధుమ నూక - 1 cup

ఉల్లిపాయలు - 1 ( సన్నగ పొడుగ్గ )

పచ్చిమెరపకాయలు - 5

శనగపప్పు - 2 tbl spoon

మినపప్పు - 1 tbl spoon

ఆవాలు - 1 tbl spoon

అల్లం - చిన్న ముక్క

నునె - 2 tbl spoon

కరివేపాకు

నీళ్ళు - 2 cups

ఉప్పు - సరిపడినంత



తయారు చేసే విధానం :


1. ఒక పాన్ లో నునె వేసి అది వేడి అయ్యాక అందులో ఆవాలు , శనగపప్పు , మినపప్పు , కరివేపాకు వేసి వేయించాలి .


2. ఇప్పుడు సన్నగ పొడుగ్గ వుల్లిపాయలు కోసి అవి ఆ నునె లో వేసి , పచ్చిమెరపకాయలు , అల్లం ముక్కలు , కరివేపాకు వేసి వేయించాలి .

3. ఇప్పుడు 2 cups నీళ్ళు పోసి అందులో ఉప్పు వేసి కాసేపు మరగనివ్వాలి.

4. నీళ్ళు మరిగిన తరవాత మంట కొంచెం తక్కువ పెట్టీ అందులో ఉప్ప్మ రవ్వ వేసి పక్క నుంచి వేరే గరిటి తో కలుపుతు ఆ రవ్వ వేసి కలపాలి.


5. ఇప్పుడు మంట ఆపేసీ దాని మీదా మోత పెట్టీ 5 నిమషాలు వుంచాలి.


6. ఇప్పుడు ఉప్ప్మ నీ పెసరట్టు , అల్లం చట్ట్నీ తో తింటే బాగుంటుంది.



అల్లం పచ్హడి కావలసినవి :


శనగపప్పు - 2 tbl spoon

మినపప్పు - 2 tbl spoon

ధనియాలు - 1 tbl spoon

జీలకర్ర - 1 tbl spoon

చింతపండు - చిన్న నిమ్మకాయంత

అల్లం - 3 inch piece

ఉప్పు - సరిపడినంత

పచ్చిమిరపకాయలు - 12 ( సన్నగ పొడుగ్గ )

బెల్లం - 1 1/2 cubes

నునె - 3 tbl spoon



అల్లం పచ్చడి తయారు చేసే విధానం :



1. పాన్ లో నునె వేసి అందులో శనగపప్పు , మినపప్పు ,దనియాలు , జీలకర్ర , పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి.

2. ఇప్పుడు అల్లం వేసి కొంచెం వేయించి ఆపేయ్యాలి.



3. ఇప్పుడు అది చల్లరబెట్టి అందులో చింతపండు , ఉప్పు , బెల్లం వేసి అందులొ కొంచెం నిళ్ళూ వేసి మెత్తగా గ్రైండ్ చెయ్యాలి .


4. అల్లం పచ్హడి , పెసరట్టు , ఉప్ప్మ తో తింటే బాగుంటుంది.

No comments: