Saturday, November 11, 2006

కేబేజి పచ్చడి


కావలసినవి :



కేబేజి - 1/2

పచ్చిమిరపకాయలు - 10

నునె - 5 tbl spoon

జీలకర్ర - 1 tbl spoon

ఆవాలు - 1 tbl spoon

ఎండుమిరపకాయలు - 3

శనగపప్పు - 1 tbl spoon

మినపప్పు - 1 tbl spoon

వెల్లుల్లి

ఉప్పు - 1 or 1 1/2 tbl spoon

కరివేపాకు

చింతపండు - 2 inch

ఉల్లిపాయ - 1



తయారు చేసే విధానం :



1. ఒక పాన్ లో 2 tbl spoons నునె వేసి వేడి చేయ్యలి. అందులో కట్ చేసిన కేబేజి ముక్కలు , పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. అది వేగిన తరవాత దానిని చల్లారబెట్టాలి.


2. ఇప్పుడు జీలకర్ర , వెల్లుల్లిపాయ గ్రైండ్ చెయ్యాలి. అందులో వేయించిన కేబేజి , పచ్చిమిరపకాయలు , ఉప్పు , చింతపండు వేసి గ్రైండ్ చెయ్యాలి. ( నీళ్ళు అవసరం అనుకుంటే 1/2 గ్లాసు కన్న తక్కువ వేసి గ్రైండ్ చేయ్యాలి).


3. ఇప్పుడు పాన్ లో 3 tbl spoons నునె వేసి అందులో ఆవాలు ,శనగపప్పు , మినపప్పు ,కరివేపాకు ,ఎండుమిరపకాయలు వేసి వేయించాలి . అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న కేబేజి మిశ్రమాన్ని వేసి బాగా వేయించాలి . (అంటె గ్రైండ్ చేసినప్పుడు కొంచెం పల్చగా వుంతుండి , అందుకని నునె లో వేయిస్తె బాగా గట్టిగా అవ్వుతాది).



4. ఉల్లిపాయ ముక్కలు ఆ పచ్చడి లో కలిపి వేడి అన్నం , నెయ్యి తో తింటే బాగుంటుంది.

No comments: