Thursday, November 16, 2006

సేమియా ఉప్మ


కావలసినవి :



సేమియా - 2 cups

ఉల్లిపాయలు - 1 ( సన్నగ పొడుగ్గ )

పచ్చిమెరపకాయలు - 7

శనగపప్పు - 2 tbl spoon

మినపప్పు - 1 tbl spoon

ఆవాలు - 1 tbl spoon


జీడిపప్పు - 2 tbl spoon

నునె - 2 tbl spoon

కరివేపాకు

నీళ్ళు - 3 cups

ఉప్పు - సరిపడినంత



తయారు చేసే విధానం :



1. ఒక పాన్ లో 1 tbl spoon నునె వేసి అది వేడి అయ్యాక అందులో సేమియా వేసి వేయించి తిసేయ్యాలి .


2. ఇప్పుడు అదే పాన్ లో మిగతా నునె వేసి అందులో ఆవాలు , శనగపప్పు , మినపప్పు , జీడిపప్పు , కరివేపాకు వేసి వేయించాలి .


3. ఇప్పుడు సన్నగ పొడుగ్గ వుల్లిపాయలు కోసి అవి ఆ నునె లో వేసి , పచ్చిమెరపకాయలు , కరివేపాకు వేసి వేయించాలి .


4. ఇప్పుడు 3 cups నీళ్ళు పోసి అందులో ఉప్పు వేసి కాసేపు మరగనివ్వాలి .


5. నీళ్ళు మరిగిన తరవాత మంట కొంచెం తక్కువ పెట్టీ అందులో సేమియా వేసి కలపాలి .


6. ఇప్పుడు దాని మీదా మోత పెట్టీ 10 నిమషాలు వుంచాలి ( అంటె సేమియా దగ్గరగా అయ్యేవరకు వుంచాలి.)

1 comment:

Anonymous said...

దయచేసి మీరు ఈ వంటలు రాయటం ఆపద్దు...మీరు ఇలా రాస్తున్నంతకాలం ఎదో ఒకటి తినగల్గుతాం...లేక పోతే మేము చేసింది మాకే తింటానికి వల్ల కావట్లేదు. "కంటిన్యూ చెయ్యండి ప్లీజ్!"