Tuesday, November 14, 2006

పప్పు బీరకాయ


కావలసినవి :


పప్పు - 1 cup

బీరకాయ - 1

మీల్ మేకెర్ - 10 to 15

పచ్చిమిరపకాయలు - 12

జీలకర్ర - 1 tbl spoon

పసుపు

ఉప్పు - తగినంత

నునె - 4 tbl spoon

ఆవాలు - 1 tbl spoon

ఎండుమిరపకాయలు - 2

కరివేపాకు - 2 రెమ్మలు

వెల్లుల్లి




తయారు చేసే విధానం :



1. ముందు బీరకాయ తొక్క తిసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి . ఇప్పుడు కూకెర్ లో పప్పు ని కడిగి అందులో బీరకాయ ముక్కలు , జీలకర్ర , 2 cups నీళ్ళు పోసి 3 విసెల్స్ లు రానివ్వాలి.


2. ఇప్పుడు ఆ పప్పు లో కొంచెం 1/4 cup నీళ్ళు పోసి అందులో ఉప్పు , పసుపు వేసి కలపాలి .


3. ఇప్పుడు ఒక పాన్ లో 2 tbl spoon నునె వేసి అందులో మీల్ మేకెర్ ని వేయించాలి . అంటే కొంచెం ఎర్రగా వేయించాలి.


4. ఆ వేయించిన మీల్ మేకెర్ ని పప్పు లో వేయ్యాలి ( అది 15నిమషాలు ముందు పప్పు లో వేస్తే మీల్ మకెర్ మెత్తగా అవ్వుతాయి ) .


5. ఇప్పుడు పాన్ లో 2 tbl spoon నునె వేసి అందులో ఆవాలు , కరివేపాకు ,ఎండుమిరపకాయలు , పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి . ఆ పోపు ని పప్పు లో వేసి కలపాలి. పప్పు మీద మోత పెట్టి దానిని స్టవ్వు మీద 5 నిమిశాలు పెట్టి దించేయాలి.



6. పప్పు బీరకాయ నీ వేడి వేడి అన్నం , నెయ్యి , ఆవకాయ తో తింటే బాగుంటుంది .

No comments: