Sunday, November 19, 2006

వేరుశనగ చట్ట్ని


కావలసినవి :




వేరుశనగ గుళ్ళు - 2 tea cups


కొబ్బరి పొడి - 1 tea cup


పుట్నాల పప్పు - 1/2 tea cup ( వేపిన శనగపప్పు )


పచ్చిమిరపకాయలు - 12


నునె - 3 tbl spoons


జీలకర్ర - 2 tbl spoons


ఆవాలు - 1 tbl spoon


ఎండుమిరపకాయలు - 3


శనగపప్పు - 1 tbl spoon


మినపప్పు - 1 tbl spoon


వెల్లుల్లి


ఉప్పు - సరిపడినంత


కరివేపాకు


చింతపండు - 3 to 4 inch






తయారు చేసే విధానం :


1. ఒక పాన్ లో వేరుశనగ గుళ్ళు వేసి వేయించాలి . అది వేగిన తరవాత దానిని చల్లారబెట్టాలి.



2. ఒక పాన్ లో 1 tbl spoon నునె వేసి వేడి చేయ్యాలి . అందులో జీలకర్ర , వెల్లుల్లి , పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి . అది వేగిన తరవాత దానిని చల్లారబెట్టాలి .



3. ఇప్పుడు వేయించిన జీలకర్ర , వెల్లుల్లిపాయ , పచ్చిమిరపకాయలు గ్రైండ్ చెయ్యాలి. అందులో వేయించిన వేరుశనగ గుళ్ళు , కొబ్బరి పొడి , పుట్నాల పప్పు , ఉప్పు , చింతపండు వేసి గ్రైండ్ చెయ్యాలి . అందులో నీళ్ళు 1/2 to 1 cup వేసి గ్రైండ్ చేయ్యాలి.

4. ఇప్పుడు పాన్లో 2tblspoons నునె వేసి ఆవాలు , శనగపప్పు , మినపప్పు , కరివేపాకు , ఎండుమిరపకాయలు వేసి వేయించాలి . అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న వేరుశనగ మిశ్రమంలొ ఆ పోపు నీ వేసి కలపాలి .



5. ఆ వేరుశనగ చట్ట్ని నీ ఇడ్లి తో లేదా దోస తో తింటే బాగుంటుంది.

No comments: