Wednesday, November 22, 2006

చిలకడదుంప కొడిగుడ్డు పులుసు


కావలసినవి :



కొడిగుడ్డ్ల్లు - 2 (వుడకబెట్టినవి)

చిలకడదుంపలు - 2

ఉల్లిపాయలు -2

పచ్చిమిరపకాయలు - 5

కారం- 1/2 to 1 tbl spoon

పసుపు

ఉప్పు - తగినంత

పంచదార - 1/2 tbl spoon

చింతపండు - 1/2 నిమ్మకాయంత

నునె - 5 tbl spoons





తయారు చేసే విధానం :



1. ఒక పాన్ లో 2 tbl spoons నునె వేసి అది వేడి చేసి అందులో పసుపు , కొడిగుడ్డ్ళ్ళు ( కొడిగుడ్డు పెచ్చు తిసేయ్యాలి ) వాటిని వేయించి తీసెయ్యాలి .


2. ఇప్పుడు అదే పాన్ లో 3 tbl spoons నునె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు , పచ్హిమిరపాకాయలు వేసి వేయించాలి . అవి వేగాక అందులో చిలకడదుంపలు ( వాటి తొక్క తిసేసి దానిని చక్రాలుగా కోసుకోవాలి ) వేసి వేయించాలి .


3. ఇప్పుడు కారం , ఉప్పు వేసి కలపాలి . అందులో చింతపండు రసం వేసి ఇంకొంచెం నీళ్ళు , పంచదార వేసి మరగబెట్టాలి . అంటే చిలకడదుంపలు వుడికేవరకు వుంచి దింపేయాలి .

No comments: