Thursday, November 23, 2006

కాలిఫ్లవర్ టొమటో కూర



కావలసినవి :


కాలిఫ్లవర్ - 1

ఉల్లిపాయలు - 2

పచ్చిమిరపకాయలు - 6

టొమటొ - 2 లేదా 3

కారం - 1 to 1 1/2 tbl spoon

పసుపు

ఉప్పు - తగినంత

నునె - 3 tbl spoons
ఆవాలు - 2 tbl spoons




తయారు చేసే విధానం :




1. ఒక పాన్ లో నునె వేసి అది వేడి చెయ్యాలి . అందులో ఆవాలు , ఉల్లిపాయముక్కలు , పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి .



2. ఇప్పుడు అందులో కాలిఫ్లవర్ ముక్కలు వేసి వేయించాలి ( కాలిఫ్లవర్ని చిన్న పువ్వులుగా విడధీసి పెట్టుకోవాలి ) .




3. అందులో టొమటొ ముక్కలు వేసి దాని మీద మోత పెట్టి వేయించాలి . అందులో కారం , పసుపు , ఉప్పు వేసి కలపాలి . అందులో కొంచెం నీళ్ళు వేసి కాలిఫ్లవర్ ముక్కలు వుడికేవరకు వుంచి దింపేయ్యాలి .

No comments: