Friday, December 22, 2006

పులిహొర



కావలసినవి :



బియ్యం - 250 gms ( 2 tea cups )




నునె - 4 tbl spoons



పచ్హిమిరపకాయలు - 15



ఎండుమిరపకాయలు - 3



శనగపప్పు - 2 tbl spoons



మినపప్పు - 2 tbl spoons



జీడిపప్పు - 3 tbl spoons



వేరుశనగ గుళ్ళు - 3 tbl spoons



కరివేపాకు - 8



ఆవాలు - 2 tbl spoons



ఉప్పు -సరిపడినంత



పసుపు - 1/4 tbl spoon



చింతపండు పేస్టు - 5 tbl spoons








తయారు చేసే విధానం :






1. ముందుగా బియ్యం నీ కడిగి 4 cups నీళ్ళు పోసి కూకెర్ లో వుడికించాలి . అది కొంచెం పోడిగ అయ్యెలా చల్లారబెట్టాలి .






2. ఇప్పుడు పాన్ లో నునెను వేసి అందులో ఆవాలు , ఎండుమిరపకాయలు , పచ్చిమిరపకాయలు , మినపప్పు , శనగపప్పు , జీడిపప్పు , వేరుశనగ గుళ్ళు , కరివేపాకు , పసుపు వేసి బాగా వేయించాలి .






3. అందులో చింతపండు పేస్టు , ఉప్పు వేసి బాగా కలిపి స్టవ్వు మీద నుంచి దింపేయ్యండి .






4. ఇప్పుడు వుడుకించిన బియ్యాన్ని అందులో వేసి బాగా కలుపుకోవాలి . పులిహొర తయారు అయ్యినట్టే .

Wednesday, December 13, 2006

బంగాలదుంప బీన్స్ వేపుడు



కావలసినవి :




బంగాలదుంపలు - 2


బీన్స్ - 250 gms


ఉల్లిపాయలు - 2


గరం మసాల - 1/4 tbl spoon


ధనియాల పొడి - 1/4 tbl spoon


కారం - 1/4 tbl spoon


పసుపు


ఉప్పు - సరిపడినంత ( 1 to 1 1/2 tbl spoons )


నునె - 5 to 7 tbl spoons


ఎండుమిరపకాయలు - 2


ఆవాలు - 1 tbl spoon


కరివేపాకు





తయారుచేసే విధానం :




1. ముందుగా పాన్ లో నునేను వేసి అది వేడి అయ్యాక అందులో ఆవాలు , కరివేపాకు ,ఎండుమిరపకాయలు వేసి వేయించాలి . ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలును వేసి ఎక్కువ మంట పెట్టీ 2 నిమషాలు బాగా ఫ్రై చెయ్యాలి .



2. అది కొంచెం వేగాక అందులో బీన్స్ ముక్కలు వేసి 2 నిమషాలు వేయించాలి . ఇప్పుడు బంగాలదుంప ముక్కలు వేసి వేయించాలి . అందులో గరం మసాల , ధనియాల పొడి , కారం , పసుపు , ఉప్పు వేయ్యాలి .



3. ఇంక అది వేయిస్తూ అప్పుడప్పుడు ఆ పాన్ మీద మోత పెట్టి వేయించాలి . అలా చేస్తే బీన్స్ , బంగాలదుంప ముక్కలు వుడుకుతాయి . అలా బీన్స్ , బంగాలదుంప ముక్కలు వుడికేవరకు వుంచాలి .




Tuesday, December 05, 2006

చికెన్ 65


కావలసినవి :



చికెన్ - 1 kg ( బోన్ లెస్ చికెన్ )

కర్న్ ఫ్లోర్ - 2 tea cups

మైదా - 1 tea cup

కోడి గుడ్డు - 4

అల్లంవెల్లుల్లి పేస్టు - 8 tbl spoons

గరం మసాలా - 4 tbl spoons

అజినొమొటొ - 2 tbl spoons ( చైనా ఉప్పు )

కారం - 4 tbl spoon

ఉప్పు - 2 tbl spoon

రెడ్ ఫుడ్ కలర్ - చిటికెడు

పెరుగు - 2 to 2 1/2 cups

నునె - చికెన్ ముక్కలు వేయించడానికి

పచ్చిమిరపకాయలు - 15
కరివేపాకు - 20

నిమ్మకాయ - 2



తయారుచేసే విదానం :



1. ఇప్పుడు ఒక బౌల్ లో చికెన్ , కర్న్ ఫ్లౌర్ , మైదా , అల్లంవెల్లుల్లి పేస్టు , గరం మసాలా , కారం , ఉప్పు , కోడిగుడ్డు ( జూసు ) , రెడ్ కలర్ , పెరుగు వేసి బాగ కలిపి 45 నిమషాలు పక్కన పెట్టాలి .


2. ఇప్పుడు నునె నీ వేడి చేసి అందులొ ఒక్కొక చికెన్ ముక్కను అందులో వేసి వేయించాలి. కొంచం వేగిన తరువాత చికెన్ ముక్కలను తిసేయ్యాలి .


3. ఇప్పుడు ఒక పాన్ లో 6 tbl spoons నునెను వేసి అందులొ (సన్నగ పొడ్డుగ్గ కట్ చేసి పెట్టుకున్న )పచ్చిమిరపాకయలను , కరివేపాకు అందులొ వేసి బాగా వేయించాలి . అందులో నిమ్మరసం వేసి , వేయించిన చికెన్ ముక్కలను వేసి 2 నిమషాలు వేయించి తిసేయ్యాలి .


4. ఇప్పుడు వేడి వేడి చికెన్ 65 ఆరగించండి .

Sunday, December 03, 2006

అరటికాయ వేపుడు


కావలసినవి :


అరటికాయ - 1 ( సన్నటి చక్రాలుగా )

ఉల్లిపాయలు - 2

ఎండుమిరపకాయలు - 5

జీలకర్ర - 1 tbl spoon

వెల్లుల్లి

కారం - 1/2 to 1 tbl spoon

పసుపు

ఉప్పు -సరిపడినంత

కరివేపాకు

నునె - 4 to 6 tbl spoons

ఆవాలు - 1 tbl spoon



తయారుచేసే విధానం :


1. ముందుగా జీలకర్ర , వెల్లుల్లి , ఎండుమిరపకాయలు - 4 గ్రైండ్ చెయ్యాలి . అందులో ఉల్లిపాయముక్కలు వేసి గ్రైండ్ చెయ్యాలి .


2. ఇప్పుడు పాన్ లో నునేను వేసి అది వేడి అయ్యాక అందులో ఆవాలు , కరివేపాకు , ఎండుమిరపకాయ - 1 వేసి వేయించాలి . ఇప్పుడు ఉల్లిపాయ ముద్దను వేసి బాగా ఫ్రై చెయ్యాలి .


3. అది కొంచెం వేగాక అందులో అరటికాయ ముక్కలు వేసి వేయించాలి . అందులో కారం , పసుపు , ఉప్పు వేయ్యలి .


4. ఇంక అది వేయిస్తూ అప్పుడప్పుడు ఆ పాన్ మీద మోత పెట్టి వేయించాలి . అలా చేస్తే అరటికాయ ముక్కలు వుడుకుతాయి . అలా అరటికాయ ముక్కలు వుడికేవరకు వుంచాలి .