Tuesday, December 05, 2006

చికెన్ 65


కావలసినవి :



చికెన్ - 1 kg ( బోన్ లెస్ చికెన్ )

కర్న్ ఫ్లోర్ - 2 tea cups

మైదా - 1 tea cup

కోడి గుడ్డు - 4

అల్లంవెల్లుల్లి పేస్టు - 8 tbl spoons

గరం మసాలా - 4 tbl spoons

అజినొమొటొ - 2 tbl spoons ( చైనా ఉప్పు )

కారం - 4 tbl spoon

ఉప్పు - 2 tbl spoon

రెడ్ ఫుడ్ కలర్ - చిటికెడు

పెరుగు - 2 to 2 1/2 cups

నునె - చికెన్ ముక్కలు వేయించడానికి

పచ్చిమిరపకాయలు - 15
కరివేపాకు - 20

నిమ్మకాయ - 2



తయారుచేసే విదానం :



1. ఇప్పుడు ఒక బౌల్ లో చికెన్ , కర్న్ ఫ్లౌర్ , మైదా , అల్లంవెల్లుల్లి పేస్టు , గరం మసాలా , కారం , ఉప్పు , కోడిగుడ్డు ( జూసు ) , రెడ్ కలర్ , పెరుగు వేసి బాగ కలిపి 45 నిమషాలు పక్కన పెట్టాలి .


2. ఇప్పుడు నునె నీ వేడి చేసి అందులొ ఒక్కొక చికెన్ ముక్కను అందులో వేసి వేయించాలి. కొంచం వేగిన తరువాత చికెన్ ముక్కలను తిసేయ్యాలి .


3. ఇప్పుడు ఒక పాన్ లో 6 tbl spoons నునెను వేసి అందులొ (సన్నగ పొడ్డుగ్గ కట్ చేసి పెట్టుకున్న )పచ్చిమిరపాకయలను , కరివేపాకు అందులొ వేసి బాగా వేయించాలి . అందులో నిమ్మరసం వేసి , వేయించిన చికెన్ ముక్కలను వేసి 2 నిమషాలు వేయించి తిసేయ్యాలి .


4. ఇప్పుడు వేడి వేడి చికెన్ 65 ఆరగించండి .

No comments: