Sunday, December 03, 2006

అరటికాయ వేపుడు


కావలసినవి :


అరటికాయ - 1 ( సన్నటి చక్రాలుగా )

ఉల్లిపాయలు - 2

ఎండుమిరపకాయలు - 5

జీలకర్ర - 1 tbl spoon

వెల్లుల్లి

కారం - 1/2 to 1 tbl spoon

పసుపు

ఉప్పు -సరిపడినంత

కరివేపాకు

నునె - 4 to 6 tbl spoons

ఆవాలు - 1 tbl spoon



తయారుచేసే విధానం :


1. ముందుగా జీలకర్ర , వెల్లుల్లి , ఎండుమిరపకాయలు - 4 గ్రైండ్ చెయ్యాలి . అందులో ఉల్లిపాయముక్కలు వేసి గ్రైండ్ చెయ్యాలి .


2. ఇప్పుడు పాన్ లో నునేను వేసి అది వేడి అయ్యాక అందులో ఆవాలు , కరివేపాకు , ఎండుమిరపకాయ - 1 వేసి వేయించాలి . ఇప్పుడు ఉల్లిపాయ ముద్దను వేసి బాగా ఫ్రై చెయ్యాలి .


3. అది కొంచెం వేగాక అందులో అరటికాయ ముక్కలు వేసి వేయించాలి . అందులో కారం , పసుపు , ఉప్పు వేయ్యలి .


4. ఇంక అది వేయిస్తూ అప్పుడప్పుడు ఆ పాన్ మీద మోత పెట్టి వేయించాలి . అలా చేస్తే అరటికాయ ముక్కలు వుడుకుతాయి . అలా అరటికాయ ముక్కలు వుడికేవరకు వుంచాలి .

No comments: