Wednesday, December 13, 2006

బంగాలదుంప బీన్స్ వేపుడు



కావలసినవి :




బంగాలదుంపలు - 2


బీన్స్ - 250 gms


ఉల్లిపాయలు - 2


గరం మసాల - 1/4 tbl spoon


ధనియాల పొడి - 1/4 tbl spoon


కారం - 1/4 tbl spoon


పసుపు


ఉప్పు - సరిపడినంత ( 1 to 1 1/2 tbl spoons )


నునె - 5 to 7 tbl spoons


ఎండుమిరపకాయలు - 2


ఆవాలు - 1 tbl spoon


కరివేపాకు





తయారుచేసే విధానం :




1. ముందుగా పాన్ లో నునేను వేసి అది వేడి అయ్యాక అందులో ఆవాలు , కరివేపాకు ,ఎండుమిరపకాయలు వేసి వేయించాలి . ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలును వేసి ఎక్కువ మంట పెట్టీ 2 నిమషాలు బాగా ఫ్రై చెయ్యాలి .



2. అది కొంచెం వేగాక అందులో బీన్స్ ముక్కలు వేసి 2 నిమషాలు వేయించాలి . ఇప్పుడు బంగాలదుంప ముక్కలు వేసి వేయించాలి . అందులో గరం మసాల , ధనియాల పొడి , కారం , పసుపు , ఉప్పు వేయ్యాలి .



3. ఇంక అది వేయిస్తూ అప్పుడప్పుడు ఆ పాన్ మీద మోత పెట్టి వేయించాలి . అలా చేస్తే బీన్స్ , బంగాలదుంప ముక్కలు వుడుకుతాయి . అలా బీన్స్ , బంగాలదుంప ముక్కలు వుడికేవరకు వుంచాలి .




No comments: