Wednesday, January 31, 2007

టొమటో పచ్చడి


కావలసినవి :


టొమటో - 2

ఉల్లిపాయలు - 2

పచ్చిమిరపకాయలు - 6

ఉప్పు - తగినంత

నునె - 4 tbl spoons

ఆవాలు - 2 tbl spoons

కరివేపాకు - 5



తయరుచెసే విధానం :



1. ఇప్పుడు పాన్ లొ 2 tbl spoons నూనే వేసి అందులొ ఉల్లిపాయ ముక్కలు , పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. ఇప్పుడు టొమటో ముక్కలు వేసి వేయించాలి. ఈ మిశ్రమంలో కొంచెం ఉప్పు గ్రైండ్ చెయ్యాలి .


2. ఇప్పుడు పాన్ లొ 2 tbl spoons నూనే వేసి అందులొ ఆవాలు , కరివేపాకు వేయించి , అందులొ ఆ గ్రైండ్ చేసిన టొమటో మిశ్రమాన్ని అందులొ కలపండి.

Friday, January 26, 2007

కొబ్బరి పచ్హడీ


కావలసినవి :



కొబ్బరి -1 cup

( కొబ్బరి ముక్కలు or ఫ్రొజెన్ కొబ్బరి )
పచ్చిమిరపకాయలు - 4

ఉప్పు - - తగినంత

కరివేపాకు - 15

ఆవాలు - 2 tbl spoons

నూనె - 1 tbl spoon




తయరుచెసే విధానం :



1. ముందుగా కరివేపాకు - 10 , పచ్హిమిర్చి గ్రైండ్ చేసి , ఆ తరువాత కొబ్బరి , ఉప్పు వేసి గ్రైండ్ చెయ్యాలి . కొంచెం నీళ్ళు పోసి గ్రైండ్ చెయ్యాలి .


2. ఇప్పుడు పాన్ లొ నూనే వేసి అందులొ ఆవాలు , కరివేపాకు వేయించి , అందులొ ఆ గ్రైండ్ చేసిన కొబ్బరి మిశ్రమాన్ని అందులొ కలపండి.

Wednesday, January 17, 2007

మైసూర్ పాక్



కావలసినవి :



శనగపిండి - 1 cup


పంచదార - 2 1/2 to 3 cups


ఈలాచి - 4 ( పొడి చేసుకోవాలి )

నెయ్యి , బట్టర్ - 1 1/2 cup


వంట సోడా - 1 tbl spoon




తయారు చేసే విధానం :




1. శనగపిండినీ వేయించాలి ( తక్కువ మంట మీద వేయించాలి ) .



2. పంచదారలో 1 గ్లాస్ నీళ్ళు పోసి పాకం పెట్టాలి .పాకం జిగురుగా వుండాలి అంటె రెండు వేళ్ళతో చుస్తె అది సాగుతున్నట్టు వుండాలి.



3. ఇప్పుడు ఆ పాకంనీ తక్కువ మంటలో పెట్టి అందులో వేపిన శనగపిండినీ , ఈలాచి పొడినీ కలపాలి .



4. ఇప్పుడు కొంచెం నెయ్యినీ , బట్టర్ నీ ( కరగబెట్టినది ) అందులో వేసి కలపుతూ వుండాలి .



5. ఒక 10 నిమషాలు పాటు దానిని అలాగే కలుపుతూ వుందాలి .



6. అందులో సోడానీ వేసి కలపాలి . ఇప్పుడు గరిటికి అంటుకొకుండా వుండెవరకు కలుపుతూ వుంచాలి .



7. ఒక ప్లెటులో నెయ్యినీ రాసి దానిలో ఆ మైసూర్ పాక్ మిశ్రమాన్ని వేసి అది వేడి వునప్పుడే ముక్కలుగా కట్ చేసుకోవాలి.

Wednesday, January 10, 2007

ఆనపకాయ టొమటో కూర


కావలసినవి :



ఆనపకాయ - 1 ( సొరకాయ )

ఉల్లిపాయలు - 3 to 4

పచ్చిమిరపకాయలు - 4

టొమటొ - 2

కారం - 1/2 to 1 tbl spoon

పసుపు

ఉప్పు - తగినంత

నునె - 3 tbl spoons

ఆవాలు - 2 tbl spoons



తయారు చేసే విధానం :




1. ఒక పాన్ లో నునె వేసి అది వేడి చెయ్యాలి . అందులో ఆవాలు , ఉల్లిపాయముక్కలు , పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి .



2. ఇప్పుడు అందులో ఆనపకాయ ముక్కలు వేసి వేయించాలి .


3. అందులో కారం , పసుపు , ఉప్పు వేసి కలపాలి .



4. అందులో టొమటొ ముక్కలు వేసి దాని మీద మోత పెట్టి వేయించాలి .


5. అందులో కొంచెం నీళ్ళు వేసి ఆనపకాయ ముక్కలు వుడికేవరకు వుంచి దింపేయ్యాలి .

ములకాడ టొమటో కూర



కావలసినవి :



ములకాడ ముక్కలు - 8 to 10

ఉల్లిపాయలు - 2

పచ్హిమిరపకాయలు - 4

టొమటో - 2

కారం - 1/2 tbl spoon

పసుపు

ఉప్పు - తగినంత

నునె - 2 tbl spoons




తయారు చేసే విధానం :




1. ఒక పాన్ లో నునె వేసి అది వేడి చెయ్యాలి . అందులో ఉల్లిపాయముక్కలు , పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి .


2. ఇప్పుడు అందులో ములకాడ ముక్కలు వేసి వేయించాలి .


3. అందులో టొమటొ ముక్కలు వేసి దాని మీద మోత పెట్టి వేయించాలి .


4. అందులో కారం , పసుపు , ఉప్పు వేసి కలపాలి . అందులో కొంచెం నీళ్ళు వేసి ములకాడ ముక్కలు వుడికేవరకు వుంచి దింపేయ్యాలి .

Tuesday, January 02, 2007

సేమ్యా పాయసం


కావలసినవి :




పాలు - 1 lt ( 10 tea cups)


సేమ్యా - 1 Cup


సగ్గుబియ్యం - 1 Cup


పంచదార - 2 Cups


జీడిపప్పు - 2 tbl spoons


నెయ్యి - 2 tbl spoons


యాలకులు - 3 ( పొడి )




తయారు చేసే విధానం :



1. ఒక పాన్ లో నెయ్యి వేసి అందులో సేమ్యాని వేసీ కొంచెం ఫ్రై చెయ్యాలి .



2. ఇప్పుడు నెయ్యి వేసి అందులో జీడిపప్పు వేసి వేయించాలి .



3. ఇప్పుడు ఒక బణాలిలో పాలు మరగ పెట్టాలి . పాలు కొంచెం మరిగాక అందులో సగ్గుబియ్యం వేసి వుడకనివ్వాలి .



4. అది కొంచెం వుడికిన తరవాత అందులో సేమ్యా నీ వేసి వుడింకించాలి .



5. అవి ఉడికిన తర్వాత పంచదార , యాలకుల పొడి వేయాలి . కాస్త దగ్గర పడ్డాక దించి జీడిపప్పును అందులో కలపాలి . అంతే .