Wednesday, February 14, 2007

పప్పు టొమాటిలోస్

కావలసినవి :


కందిపప్పు - 1 cup

టొమాటిలోస్ - 5 ( చిన్నవి )

(పచ్చగా వుంటాయి)


ఉప్పు - తగినంత

పసుపు - చిటికెడు

పచ్చిమిరపకాయలు - 5

ఆవాలు - 1 tbl spoon

ఎండుమిరపకాయాలు - 2

వెల్లుల్లి

కరివేపాకు - 5

నునె - 2 tbl spoon




తయారు చేసే విధానం :




1. ముందుగా కందిపప్పుని కడగాలి. అందులో 1 1/2 కప్పుల నీళ్ళు పోసి వుంచాలి.


2. టొమాటిలోస్ ముక్కలు కుడా అందులో వేసి కుకర్ లో 3 విసెల్ల్స్ రానివ్వాలి.



3. ఇప్పుడు కుకర్ ఆవిరి పోయిన తర్వాత ఆ పప్ప్పు లో ఉప్పు, పసుపు వేసి కలుపుకోవాలి.



4. ఒక పాన్ లో నునె వేసి అందులో వెల్లుల్లి, ఆవాలు, ఎండుమిరకాయలు, కరివేపాకు వేసి వేయించాలి.


5. ఇప్పుడు ఈ పోపు నీ పప్పు లో వేయ్యాలి. పప్పు మీద మోత పెట్టి దానిని స్టవ్వు మీద 5 నిమిషాలు పెట్టి దించేయాలి.

6. ఈ టొమాటిలోస్ చాలా పుల్లగా వుంటాయి.అంటే మమిడికాయ ఎలా పుల్లగా వుంటుందో అలా పుల్లగా ఎది వుంటుంది.


7. మనం పప్పు మమిడికాయ చేస్తాము కదా అలాగే వుంటుంది ఈ పప్పు టొమాటిలోస్ .



2 comments:

Sindhu said...

ఆ టమటో బాలే వుంది.

Rani said...

పప్పు మమిడికాయ అంటె నాకు చాలా ఇష్టం. ఇది కుడా అలాగే వుంటుంది అంటున్నారు కాబట్టి ఇది కూడా చేస్తాను.