Saturday, February 17, 2007

బ్రెడ్ బొండా

కావలసినవి :


బ్రెడ్ పీసులు - 8 నుంచి 10

బంగాలదుంపలు - 2 (వుడకబెట్టినవి)

పచ్చి బఠానీలు - 1/2 cup

ఉల్లిపాయలు - 2

నిమ్మ జూసు - 1 tbl spoon

కారం - 1/4 tbl spoon

ఉప్పు - సరిపడినంత

పసుపు - చిటికెడు

గరం మసాల - 1/4 tbl spoon

అల్లం వెల్లుల్లి పేస్టు - 1/4 tbl spoon

చాట్ మసాల - 1/4 tbl spoon

ఆవాలు - 1 tbl spoon

కరివేపాకు - 4

కొత్తిమెర

నునె - 3 tbl spoons


తయారు చేసే విధానం :

1. ఒక పాన్ లో నునె వేసి వేడి చెయ్యాలి. అందులో ఆవాలు, కరివేపాకు వేసి వేయించాలి.

2. అందులో ఉల్లిపాయముక్కలు వేసి వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాల, చాట్ మసాల వేసి వేయించాలి.

3. ఉల్లిపాయలు కొంచెం వేగాక అందులో బంగాలదుంపను , పచ్చి బఠానీలు వేసి వేయించాలి.( వుడికించిన బంగాలదుంపల్ని పొట్టు తిసేసి దానిని చేతితో చిదిపెయ్యాలి).

4. పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.

5. స్టవ్వు మీద నుంచి దింపేముందు కొత్తిమెర, నిమ్మ జూసు వేసి కలుపుకోవాలి.

6. ఆ బంగాలదుంప కూరనీ వుండలుగా చేసుకోని వుంచాలి.

7. బ్రెడ్ నీ పాలతో కొంచెం తడిపి ఒకొక్క బ్రెడ్ కి ఒకొక్క వుండని పెట్టి బొండా లా చేసుకొని దానిని నునెలో వేయించు కోవాలి.

8. బ్రెడ్ బొండా నీ టొమటో సాస్ తో తింటే బాగుంటుంది.

3 comments:

Anonymous said...

intha easy aaa....

Sindhu said...

nenu try chesanu baaga vachindi.

Anonymous said...

very tasty,really awesome